తమన్నా ​మూడవ బాలీవుడ్ సినిమా షూటింగ్ ప్రారంభం ​

tamannah-bollywood-movie

తమన్నా ​నటించిన మొదటి బాలీవుడ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఆశించినంత విజయాన్ని సాదించకపోయిన తమన్నా కి అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ రెండు సినిమాల్లో నటిస్తోంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటిస్తోంది. అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ గత నెలలో మొదలైంది. అలాగే తను సైఫ్ అలీ ఖాన్ తో కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ నిన్న లండన్ లో ప్రారంభమయ్యింది. ఈ సినిమా టైటిల్ ‘హమ్ శకల్స్’. ఈ సినిమాలో మరొక నటి ఇషా గుప్త కూడా నటించనుందని సమాచారం.

Exit mobile version