పాలరంగుతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలుగించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. తన నడుము ఒంపులు అక్కడ వారికి కుడా రుచి చూపించనుంది. సరిగ్గా 30 ఏళ్ళ క్రితం వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘హిమ్మత్ వాలా’ సినిమాని ఇప్పుడు రీమేక్ చేసారు.ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఆకాలంలో జనాన్ని నిద్రపట్టనివ్వకుండా చేసిన శ్రీ దేవి పాత్రలో ఇప్పుడు తమన్నా నటిస్తుంది. అప్పటి ధర్మేందర్ పాత్రలో ఇప్పుడు అజయ్ దేవగన్ నటించాడు. ఈ సినిమాలో పులితో చేసిన ఫైట్ హైలైట్ అట. ఈ సినిమా మంచి విజయాన్ని సాదించాలని, తమన్నకి మరిన్ని అవకాశాలు దక్కాలని కోరుకుందాం.