అక్కడ కూడా హిట్ కొడతానంటున్న తమన్నా

అక్కడ కూడా హిట్ కొడతానంటున్న తమన్నా

Published on Apr 23, 2013 6:16 PM IST

Tamanna-New
మిల్క్ బ్యూటీ తమన్నా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సినిమా ఆమె అనుకున్నంత పేరుని, అంచనాలను రీచ్ అవ్వలేదు. ‘హిమ్మత్ వాలా’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కానీ తమన్నా మాత్రం అంత ఈజీగా ఆ విషయాన్ని వదిలేయాలనుకోవడం లేదు. ఇటీవలే ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్లానింగ్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పింది. “ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ నా కెరీర్ మొదట్లో సరైన హిట్స్ అందుకోలేకపోయాను. అలా అని నేను వదిలెయ్యలేదు అలాగే బాలీవుడ్లో కూడా హిట్ అందుకుంటాను. ప్రతి సంవత్సరం బాలీవుడ్లో ఒక సినిమా అన్నా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నానని’ చెప్పింది. తమన్నా త్వరలోనే నాగ చైతన్య ‘తడాఖా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు