‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీను వైట్ల కలిసి పనిచెయ్యనున్నరు. ఈ సినిమాకు ‘ఆగడు’ అనే టైటిల్ ను ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ సరసన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు. మహేష్ – తమన్నాల జోడీ ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటికే శ్రీను వైట్ల తన సహ రచయిత గోపీ మోహన్ తో కలిసి స్క్రిప్ట్ పనులలో ఊటిలో బిజీగావున్నాడు. ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావచ్చు. ‘దూకుడు’ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, గోపీచంద్, రామ్ ఆచంట లు 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
ఈ జోడీ మీకు నచ్చిందా?? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి ఫ్రెండ్స్.