తమన్నా- నాగ చైతన్య జోడీగా మరో చిత్రం

తమన్నా- నాగ చైతన్య జోడీగా మరో చిత్రం

Published on Aug 25, 2012 10:23 AM IST


‘100% లవ్’ సినిమాతో మిల్క్ బ్యూటీ తమన్నా మరియు నాగ చైతన్య హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం తమన్నా మరోసారి నాగ చైతన్య సరసన నటించనుంది. నాగ చితన్య హీరోగా నటిస్తున్న ‘వేట్టై’ సినిమా రిమేక్ లో తమన్నా కథానాయికగా నటించనుంది. ముందుగా ఈ పాత్రకి హన్సిక ని తీసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పాత్రకి తమన్నాను తీసుకున్నారు. తమన్నా- నాగ చైతన్య జంటగా వచ్చిన ‘100% లవ్’ సినిమా సక్సెస్ సెంటిమెంట్ వల్లే ఈ సినిమాలో తమన్నాని కథానాయికగా తీసుకోవడానికి ఒక కారణం అని వార్తలు వస్తున్నాయి.

కామెడీ హీరో సునీల్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన ఆండ్రియా జేరేమియా కథానాయికగా నటిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాదించిన ‘వేట్టై’ సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు సునీల్ అన్నదమ్ములుగా కనిపించనున్నారు.

తాజా వార్తలు