నాగ చైతన్య సరసన తమన్నా, హన్సిక

Tamanna-and-Hansika
అక్కినేని నాగార్జున ‘హలో బ్రదర్’ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, సౌందర్య గుర్తున్నారా? ఆ సినిమాలో రమ్యకృష్ణ గ్లామర్ తో ఆకట్టుకుంటే, సౌందర్య మన పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ ఇద్దరి స్థానాల్ని మిల్కీ బ్యూటీ తమన్నా, అందాల భామ హన్సిక భర్తీ చేయనున్నారు.

జూలై నుంచి మొదలు కానున్న ఈ ‘హలో బ్రదర్’ రీమేక్ లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. తమన్నా, హన్సిక నాగ చైతన్య సరసన ఆడిపాడనున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, సౌందర్యలను మించి తమన్నా, హన్సిక ప్రేక్షకులను మెప్పించగలరా? అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..

Exit mobile version