రాక్షసుడు దర్శకుడికి నిర్మాత ఖరీదైన బహుమతి

రాక్షసుడు దర్శకుడికి నిర్మాత ఖరీదైన బహుమతి

Published on Feb 6, 2020 12:00 AM IST

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ని పరాజయాల నుండి బయటవేసిన చిత్రం రాక్షసుడు. తమిళ హిట్ మూవీ రాక్షసన్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. రాక్షసుడు చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆకట్టుకొనేలా తెరకెక్కించారు. రాక్షసుడు మూవీ హిట్ కొట్టిన నేపథ్యంలో నిర్మాతలు మంచి లాభాలు అందుకున్నారు.

రాక్షసుడు మూవీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సత్యనారాయణ నిర్మించారు. రాక్షసుడు మూవీ లాభాలు పంచిన నేపథ్యంలో నిర్మాత సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఓ ఖరీదైన ప్లాట్ బహుమతిగా ఇచ్చారట. దీనితో రమేష్ వర్మ నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. స్కూల్ కి వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపే ఓ సైకో కిల్లర్ ని వేటాడే పోలీస్ అధికారి కథగా వచ్చిన ఈ చిత్రంలో శ్రీనివాస్ నటన కట్టిపడేసింది. ఇక ఈ చిత్రంలో శ్రీనివాస్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించారు.

తాజా వార్తలు