మెగాస్టార్, నాగార్జునలతో మంత్రి భేటీ !

మెగాస్టార్, నాగార్జునలతో మంత్రి భేటీ !

Published on Feb 4, 2020 5:55 PM IST

సినీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీయార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా జరిగిన ఓ వేడుకలోనూ హైదరాబాద్ లో సినిమా రంగం మరింతగా అభివృద్ధి చెందాలని.. దాని కోసం త్వరలోనే సినీ పెద్దలతో కూర్చుని చర్చించి కొన్ని కార్యక్రమాలు చేపడతామని కేసీయార్ తెలిపారు. కాగా తాజాగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా రంగం అభివృద్ధి సంబంధించి చర్చించారు.

సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున లతో సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సినిమా రంగానికే తలమానికంగా మారిన సంగతి తెలిసిందే. దానిని మరో మెట్టు ఎక్కించాలని ప్రభత్వం నిర్ణయించుకుంది.

తాజా వార్తలు