విడుదలైన తడాఖా ఆడియో

విడుదలైన తడాఖా ఆడియో

Published on Apr 24, 2013 4:42 PM IST

Tadakha-Audio-Launch-(35)

నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన ‘తడాఖా’ సినిమా ఆడియో ఈరోజు హైదరాబాద్లో శిల్పకళా వేదికలో విడుదలైంది. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున ముఖ్య అతిధులుగా విచ్చేశారు. నాగ చైతన్య, సునీల్, తమన్నా, కిషోర్, బెల్లంకొండ సురేష్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా కనిపించగా వారి సరసన తమన్నా, ఆండ్రియా మెరవనున్నరు . ‘100% లవ్’ సినిమా తరువాత మరోసారి కలిసి నటిస్తున్న నాగ చైతన్య, తమన్నాల కెమిస్ట్రీ ట్రైలర్లలో చక్కగా కుదిరి ప్రజాదరణ పొందుతున్నాయి. నిర్మాత సురేష్ సినిమా విజయం పట్ల చాలా ధీమాగా ఉన్నారు . ఇదివరకు ‘కొంచం ఇష్టం కొంచెం కష్టం’ సినిమా తీసిన దర్శకుడు కిషోర్ సినిమాలో నటించిన వారందరూ అద్బుతంగా నటించారని తెలిపారు. ఆర్థర్ విల్సన్ కెమెరామాన్, థమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా వేసవి తరువాత మన ముందుకు రానుంది.

తాజా వార్తలు