అక్కినేని నాగచైతన్య, సునీల్ కలిసి నటిస్తున్న ‘తడాఖా’ సెన్సార్ పనులు ముగించుకుని యు/ఏ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ సినిమా మే 10వ తేదిన భారీ రీతిలో విడుదలకానుంది.
‘తడాఖా’ సినిమా తమిళ చిత్రం ‘వేట్టాయ్’ సినిమాకు రీమేక్. నాగ చైతన్య, సునీల్, తమన్నా మరియు యండ్రియా జెరేమియా ప్రధాన పాత్రధారులు. అన్నదమ్ముల్ల సెంటిమెంట్, అద్బుతమైన ఎంటర్టైన్మెంట్ సినిమాకు బలాలు.
డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు.