తన అందం మరియు అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకున్న ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ కి తెలుగులో ఇంతవరకూ చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్ లేదు. తను నటించిన తెలుగు సినిమాల్లో ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. ప్రస్తుతం తాప్సీ ‘గుండెల్లో గోదారి’, ‘షాడో’, చంద్ర శేకర్ యేలేటి సినిమా మరియు అజిత్ సరసన ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాల్లో ఎదో ఒకటి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిస్తే తన కెరీర్ మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఇటీవలే తాప్సీ చెన్నైలో మీడియాతో మాట్లాడినప్పుడు ‘నాకు చాలెంజింగ్ పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు శారీరక లోపాలున్నా పాత్రలు చేసి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని’ తన మదిలోని కోరికను బయటపెట్టింది. తాప్సీ ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ఒక గ్రామ యువతిగా నటించింది, తన తోటి నటీనటులు ఆమె నటనను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ గ్లామర్ డాల్ చెప్పిన మాటలు విని తనకు అలాంటి పాత్రలు ఎవరన్నా ఇస్తారేమో వేచి చూడాలి.
తాప్సీ కోరిక నెరవేరేనా?
తాప్సీ కోరిక నెరవేరేనా?
Published on Oct 28, 2012 8:31 PM IST
సంబంధిత సమాచారం
- అవైటెడ్ ‘ఓజి’ ట్రైలర్ ఆరోజున?
- అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ ?
- అల్లు అర్జున్ కూడా అప్పుడే వస్తాడా..?
- పుష్ప విలన్‌తో 96 డైరెక్టర్.. ఇదో వెరైటీ..!
- ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ డేట్!
- ‘ఓజి’ దూకుడు ఆగేలా లేదుగా..!
- ఆసియా కప్ 2025: యూఏఈతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఆడే అవకాశం ఉన్న 11 మంది ఆటగాళ్లు వీరే!
- అల్లు అర్జున్ లాంచ్ చేసిన మంచు లక్షి ‘దక్ష’ ట్రైలర్
- ఓటీటీలో రెండు వారాలుగా అదరగొడుతున్న ‘కింగ్డమ్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఆసియా కప్ 2025: షెడ్యూల్, టీమ్‌లు, మ్యాచ్ సమయాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
- బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో
- ఓటిటి సమీక్ష: ‘మౌనమే నీ భాష’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- కాజల్ కి యాక్సిడెంట్? క్లారిటీ ఇచ్చిన ‘సత్యభామ’
- వైరల్ వీడియో: OG కోసం జపనీస్ బీట్స్ తో అదరగొడుతున్న థమన్
- థియేటర్/ఓటీటీ : ఈ వారం సందడి చేయబోయే సినిమాలివే..!
- రజిని, కమల్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కమల్ బిగ్ అప్డేట్!
- ‘మల్లెపూల’ పంచాయితీ.. లక్షకు ఎసరు..!