సాహసం కోసం తాప్సీ చేస్తున్న సాహసం ఏమిటి?

Taapsee
‘గుండెల్లో గోదారి’ సినిమాలో పక్కింటి అమ్మాయిలా, ‘షాడో’ సినిమాలో హాట్ హాట్ గర్ల్ లా కనిపించిన తాప్సీ ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి తీస్తున్న ‘సాహసం’ సినిమాలో పూర్తీ వైవిధ్యమైన పాత్రలో కనిపించనుంది. పాపాలు ఎక్కువైపోవడం వల్ల త్వరలో యుగాంతం సంభవిస్తుంది అని అనుకునే అమాయకపు పాత్రలో తాప్సీ కనపడనుంది. ఈ సినిమాలో పాత్రలలోకి నటులు ప్రవేశించాలని దర్శకుడు కోరడంతో తాప్సీ పాటలలో సైతం గ్లామర్ అంశాన్ని తగ్గించుకుంది. “‘సాహసం’లో కనిపించినట్టు నేను మరెక్కడా కనిపించను. చాలా విధాలుగా ఇది నాకు ప్రత్యేకమైన సినిమా”అని ట్వీటిచ్చింది. ఈ భామ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ట్రైలర్ ద్వారా ఇది ఒక సాహసవంతమైన సినిమా అని తెలుస్తుంది. శ్రీ సంగీతం అందించాడు. షాందత్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా ఈ నెలాఖరున విడుదలకావచ్చు.

Exit mobile version