స్కూబా డైవింగ్ సర్టిఫికేట్ పొందిన తాప్సీ.!

స్కూబా డైవింగ్ సర్టిఫికేట్ పొందిన తాప్సీ.!

Published on Apr 10, 2013 3:45 PM IST

Taapsee
సెలబ్రేటిలు తమ కలల్ని, చిన్ననాటి ఊహల్ని సాకారం చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ వుంటారు. ప్రపంచలో చాలా ప్రదేశాలకు, అందమైన లోకేషన్స్ కి చాలా మంది సెలబ్రిటీలు తమ ఆనందం కోసం వెళ్తుంటారు. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న స్కూబా డైవింగ్(సముద్రపు అడుగున ఈదడం)ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవలే త్రిష, చార్మీ, నిఖీషా పటేల్ హాలిడే కోసం మాల్దీవులకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి స్కూబా డైవింగ్ కి అవకాశం వచ్చింది.

ఇప్పుడు తాప్సీ తన స్కూబా డైవింగ్ స్కిల్స్ గురించి చెప్పింది. తాప్సీ నటించిన ‘చష్మే బద్దూర్’ సినిమా విజయాన్ని సాదించడంతో హాలిడే కోసం మాల్దీవులకు తన చెల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ తాప్సీ ఐస్ ల్యాండ్ ఉందని, తను స్కూబా డైవింగ్ కొరకు పరీక్ష రాశానని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆ పరీక్షలో తాపసీ పాస్ అయ్యింది. ‘యా.. యా …… నేను స్కూబా లైసెన్స్ ను పొందాను. ఇక నుండి మరో ప్రపంచంలో కూడా మెంబర్ ని అయ్యాను. ఈ డ్రీం ల్యాండ్ లో చివరి రోజు రేపటి నుంచి రియల్లిఫే లోకి వచ్చేస్తాను. ఇదే ప్రపంచం ఇంకొద్ది రోజులు ఉంటె బాగుంటుందని అనిపిస్తోందని’ తాప్సీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

తాప్సీ చివరిగా ‘గుండెల్లో గోదావరి’ సినిమాలో కనిపించింది. ప్రస్తుం తన రాబోవు సినిమా షాడో లో వెంకటేష్ తో కలసి నటించింది. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. వీటితో పాటుగా త్వరలో విడుదల కానున్న ‘విష్ణువర్ధనం’ తమిళ సినిమాలో, గోపీచంద్ సినిమా ‘సాహసం’ , లారెన్స్ ‘ముని-3′” లో నటిస్తోంది.

తాజా వార్తలు