విడుదలకాబోయే సినిమాకోసం తాప్సీ పడుతున్న ఆరాటం

Taapsee
దక్షిణాదిన బిజీ తారగా కొనసాగుతూ బాలీవుడ్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న భామ తాప్సీ. ఆమె చివరిగా నటించిన ‘చష్మే బద్దూర్’ మరియు ‘సాహసం’ సినిమాలు విజయం సాధించాయి

ప్రస్తుతం తాప్సీ తన తమిళ చిత్రం ‘అర్రంబమ్’ విడుదలకు వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ స్థాయిలో రేపు విడుదలకానుంది. డల్హౌస్ నుండి స్వయంగా వచ్చి ఈ మాస్ రిలీజ్ లో పాల్గొనటానికి తాప్సీ ఉత్సాహపడుతుంది. దర్శకుడిని, హీరోను తెగపోగుడుతూ ట్విటర్ లో తన హవాను కొనసాగిస్తుంది

అజిత్, నాయనాటారా, తాప్సీ ముఖ్యపాత్రధారులు. విష్ణువర్ధన్ దర్శకుడు. యువన్ శంకార్ రాజా సంగీత దర్శకుడు. ఏ. రఘురాం నిర్మాత

Exit mobile version