తాప్సీ మరియు ఆర్య, విష్ణువర్ధన్ చిత్రంలో నటించడం మొదలు పెట్టినప్పటి నుండి వాళ్ళ స్నేహం గురించి పలు పుకార్లు వచ్చాయి కొంతమంది వాళ్ళ మధ్య స్నేహం కాదు అంతకన్నా ఎక్కువ ఉందని పుకార్లు సృష్టించారు. తనకి ఆర్యకి మధ్యలో ఏం లేదని తాప్సీ స్పష్టం చేశారు. ఒకానొక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ” ఆర్య నాకు సహా నటుడు మాత్రమే నాకు ఇలా ఉండటమే బాగుంది ఇప్పట్లో పని గురించి తప్ప మిగతా వాటి గురించి ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను” అని అన్నారు. ప్రస్తుతం ఈ నటి మెహర్ రమేష్ “షాడో” చిత్రం కోసం హైదరాబాద్లో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో విష్ణు వర్ధన్ చిత్రం చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రంలో అజిత్, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈమె చేస్తున్న అతిపెద్ద చిత్రం ఇది. ఈ రెండు చిత్రాలు కాకుండా ఈ భామ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో గోపీచంద్ సరసన నటిస్తున్నారు ప్రస్తుతం “గుండెల్లో గోదారి” చిత్రం విడుదలకై వేచి చూస్తున్నారు.