కత్తి ఫైట్స్ నేర్చుకుంటున్న ప్రభాస్ – రానా

కత్తి ఫైట్స్ నేర్చుకుంటున్న ప్రభాస్ – రానా

Published on Feb 1, 2013 12:10 PM IST

Prabhas-Rana

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మాచో హంక్ రానా అన్నదమ్ములుగా, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘బాహుబలి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రభాస్ – రానా ఈ రోజు నుంచి కత్తి ఫైట్స్ నేర్చ్గుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క కూడా కత్తి ఫైట్ నేర్చుకుంటోంది.

ఈ రోజు డైరెక్టర్ రాజమౌళి తన ట్విట్టర్లో ‘ ఈ రోజు ప్రభాస్ – రానాకి కత్తి ఫైట్ ట్రైనింగ్ మొదటి రోజు. వారున్న హైట్, పర్సనాలిటీకి ఎగురుతుంటే మనుషుల్లా అనిపించడం లేదు. వీరికి తగ్గట్టుగానే అనుష్క హైట్ కూడా 5′.10 కావడంతో వారికి సమానంగా ఉంది. ఈ ట్రైనింగ్ చాలా బాగుంది. కానీ సమస్య మొత్తం ఫోటోగ్రఫీ డైరెక్టర్ కే ఎందుకంటే వారిద్దరినీ ఒకే ఫ్రేంలో చూపించాలి కదా’ అని తెలిపారు.

భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా 2014లో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు