‘స్వయంభు’ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది..!

హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘స్వయంభు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పిరియాడికల్ మైథలాజిక్ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఓ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్, వీడియోను నవంబర్ 24న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

యుద్ధంలో తన ప్రతాపాన్ని చాటున్న హీరో మనకు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version