బ్యాంగర్ ప్రోమోతో వచ్చిన ‘రెబెల్ సాబ్’

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి పూర్తి హారర్ కామెడీగా తెరకెక్కిస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుండి ‘రెబెల్ సాబ్’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. ఈ ప్రోమోలో వింటేజ్ డార్లింగ్ లుక్స్‌తో ప్రభాస్ స్టన్ చేస్తున్నాడు. ‘రాజా ఎంట్రీ లెవెల్ బ్యాంగర్’ అంటూ ఈ పాటను థమన్ నెక్స్ట్ లెవెల్‌లో కంపోజ్ చేశాడు. ఇక ప్రభాస్ నుండి ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ కూడా మనకు ఈ పాటలో కనిపిస్తాయని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

రెబెల్ సాబ్ సాంగ్ నవంబర్ 23న సాయంత్రం 6.11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తు్న్నారు.

Exit mobile version