ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకున్న సీతమ్మ వాకిట్లో …

SVSC
మహేష్ బాబు మరియు వెంకటేష్ ప్రధాన పాత్రలలో రానున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంది. సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్నఈ చిత్రంలోని పెళ్లి పాటను ఈ మధ్యనే హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ పాటతో మరొక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఆడియో విడుదల డిసెంబర్ 16న జరగనుంది. ఈ వేడుక తరువాత వెంకటేష్ మరియు అంజలి మధ్య వాన పాట చిత్రీకరణ కోసం కేరళ వెళ్లనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తుండగా నిన్న విడుదలయిన ఈ చిత్ర ఆడియో ప్రోమోస్ కి అనూహ్య స్పందన కనపడింది. కె వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చెయ్యనున్నారు.

Exit mobile version