సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో రానున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. మొదటి సారి మహేష్ బాబు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి తెర పంచుకోనున్నారు. ఇటీవలే నేషనల్ డైలీ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ‘ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వెంకటేష్ గారి అభిమానులకు మరియు నా అభిమానులకు ఒక కొత్త అనుభూతికిలోను చేస్తుంది. సినిమా చూసి బయట వచ్చే టప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎంతో సంతోషంగా, చాలా మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ తో బయటకొస్తారని’ చెప్పాడు.
అలాగే సినిమాలో ఫ్రెష్ నెస్ ఒక్కటే ఉంటుందా అనడిగితే నా కెరీర్లో ఇంత ఇష్టపడి ఏ సినిమా చేయలేదు మరియు స్క్రిప్ట్ విన్నప్పుడే ఈ సినిమాని ప్రేమించేసానని అన్నాడు. ఈ నెల మూడవ వారంలోపు షూటింగ్ పూర్తి కానున్న ఈ సినిమాకి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 15న ఆడియో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.