చివరి దశకు చేరిన సీతమ్మ వాకిట్లో… టాకీ పార్ట్


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా ఈ చిత్ర టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం ముగియనుంది. ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది, వాటిని కూడా డిసెంబర్ సగాని కల్లా పూర్తి చేయనున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2013 జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్ కి జోడీగా అంజలి, మహేష్ బాబుకి జోడీగా సమంత నటిస్తోంది.

ఈ రోజు లుంబిని పార్క్ లో మహేష్ బాబు మరియు సమంత లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోని వెంకీ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు.

Exit mobile version