తణుకు శివార్లలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

తణుకు శివార్లలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

Published on Jul 11, 2012 11:56 AM IST


టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. ప్రస్తుతం ఈ చిత్రం తణుకు సమీపంలోని రేలంగి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న ఈ కుటుంబ కథా చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం తణుకులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత జూలై 16 నుంచి భద్రాచలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు