మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న వెంకీ – మహేష్ మూవీ

మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న వెంకీ – మహేష్ మూవీ

Published on Aug 16, 2012 3:27 PM IST


టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా 2013 జనవరిలో విడుదల చేయనున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకున్నారు, కానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సమంత అనారోగ్యం పాలవడం వల్ల ఈ చిత్ర చిత్రీకరణ వాయిదా పడింది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపించనున్నారు.

దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కుటుంబ కథా చిత్రం ఇది, అంతేకాకుండా ఇందులో ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ మరియు మహేష్ బాబులకు తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్ మరియు జయసుధ నటిస్తున్నారు.

తాజా వార్తలు