సీతమ్మ వాకిట్లో .. ఆడియో వేదిక ఖరారు


మేము విన్న సమాచారం ప్రకారం డా. డి. రామానాయుడు నానక్రాంగూడా స్టూడియోస్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా మన విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో విడుదల కార్యక్రమం కోసమే. ఈ వేడుకని భారీ ఎత్తున జరగనుంది మరియు ఈ వేడుకకి భారీగా అభిమానులు వస్తారని వేదికని ఎంచుకోవడం కోసం కొంత సమయం పట్టింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ ఆడియోని మొదటగా డిసెంబర్ 13న విడుదల చేయాలనుకున్నారు కానీ అది ఇప్పుడు వాయిదా పడి డిసెంబర్ 15న విడుదల కానుంది.

ఈ సినిమాలో వెంకటేష్ మరియు మహేష్ బాబులను అన్నదమ్ములుగా చూపిస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని ఇది వరకే తెలిపాము. ఇంకా రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత మరియు అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version