మంచి మనుషుల కథ, మంచి మనసుల మధ్య సంఘర్షణ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల విలువని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు స్టార్ హీరోలు తమ స్టార్ హోదాని పక్కన పెట్టి చేసిన ఈ చిత్రం విడుదలకి సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర డబ్బింగ్ జనవరి 3న పూర్తవుతుంది.ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలకు విపరీతమైన ఆదరణ వస్తోంది. తొందర్లోనే ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ రవిబాబు, రావు రమేష్ ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.