ఒక రోజు ఆలస్యంగా సీతమ్మ వాకిట్లో … ఆడియో


చాలా కాలం తరువాత వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో ఒకరోజు ఆలస్యంగా రానుంది. మొదటగా 15న విడుదల చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా డిసెంబర్ 16న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఆడియో కోసం అటు వెంకటేష్ అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తి చేసి సంక్రాంతి వరకు సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. వెంకటేష్, మహేష్ లకు జోడీగా అంజలి, సమంత నటిస్తున్నారు.

Exit mobile version