భారత ప్రభుత్వం తెలుగులో ఫేమస్ అయిన లెజండ్రీ నటులైన ఎస్.వి రంగారావు గారు, భానుమతి గారు, అల్లు రామలింగయ్య గారి పేర్లమీద పోస్టల్ స్టాంప్స్ ని విడుదల చేసారు. అలాగే ఇండియా లో ఫేమస్ నటులైన బాల్రాజ్ సహ్ని, గీత దత్, నగేష్, ఓ.పి నాయర్, ఆర్.డి బర్మన్, రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్ పేర్లమీద కూడా స్టంప్స్ విడుదల చేసారు.
ఇండియన్ సినిమా 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ స్టాంప్స్ ని విడుదల చేసారు. ఒక్కో స్టాంప్ విలువ కేవలం 5 రూపాయలు మాత్రమే. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఈ స్టంప్స్ మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసులలో లభిస్తాయి.