బోల్ బచ్చన్ రీమేక్ కి దర్శకుడు ఎవరు?

Venkatesh (12)విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది రెండు చిత్రాలలో నటించారు. ఈ ఏడాది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మరియు “షాడో” చిత్రాలలో నటించిన ఈ నటుడు తరువాత చిత్రం కూడా దాదాపుగా ఖరారు అయ్యింది. “బోల్ బచ్చన్” చిత్ర రీమేక్లో ఈయన నటించనున్నారు. అజయ్ దేవగన్,అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ఈ చిత్రం మాతృకలో నటించారు ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు తెలుగులో మరో తార రామ్ అని వదంతులు ఉన్నాయి. ఈ చిత్ర దర్శకుడి గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందులో ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్ ఒకరు గతంలో “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Exit mobile version