దాదాపు మూడు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత హీరో సుశాంత్ ‘అడ్డా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ రోజు హైదరాబాద్ లోని పలు థియేటర్లలో అభిమానులను కలిసి సందడి చేసాడు. థియేటర్లో ప్రేక్షకులను కలుసుకున్న సుశాంత్ వారి రెస్పాన్స్ చూసి ఎంతో ఖుషీ ఖుషీ గా ఉన్నాడు. ‘ ఇప్పుడే రెండు థియేటర్స్ ని విజిట్ చేసాను. ఫుల్ ఎనర్జీ ఇచ్చిన ఆడియన్స్ కి నా ధన్యవాదాలని’ సుశాంత్ ట్వీట్ చేసాడు.
సుశాంత్ సరసన శాన్వి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జి కార్తీక్ రెడ్డి డైరెక్టర్. చింతలపూడి శ్రీనివాస్ – నాగసుశీల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.