ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కీ బోర్డ్ నేర్చుకుంటున్న హీరో సుశాంత్..!

ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కీ బోర్డ్ నేర్చుకుంటున్న హీరో సుశాంత్..!

Published on May 14, 2020 3:00 AM IST


ప్రస్తుతం కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు సైతం ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. అయితే హీరో సుశాంత్ కూడా లాక్‌డౌన్‌ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కీ బోర్డ్ వాయించడం ఎలానో నేర్చుకుంటున్నానని నాకు ఆల్ ద్ బెస్ట్ చెప్పండి అంటూ తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి సినిమాలలో హీరోగా నటించిన సుశాంత్ అలవైకుంఠపురంలో సినిమాలో రాజ్ అనే పాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం దర్శన్ దర్శకత్వంలో ఇచ్చట వాహనాలు నిలుపరాదు అనే సినిమాలో సుశాంత్ హీరోగా నటిస్తున్నాడు.

తాజా వార్తలు