రాజమౌళి సూక్తులు ఫాలో అవుతున్న సుశాంత్

Rajamouli-and-Sushanth

అక్కినేని వంశం నుండి ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుశాంత్ సినిమా వచ్చి నాలుగేళ్ళు పూర్తి కావస్తుండడంతో ప్రస్తుతం సుశాంత్ తన రాబోయే ‘అడ్డా’ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ నాలుగు సంవత్సరాల్లో అతను ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ పెద్దగా అనిపించలేదు. చివరికి ‘అడ్డా’ సినిమా స్టొరీ నచ్చడంతో ఓకే చేసాడు. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చింతలపూడి శ్రీనివాసరావు – నాగ సుశీల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ మాట్లాడుతూ ‘నాలోని శక్తికి నాగార్జున గారు పిల్లర్ లాంటి వారు. ఆయన అన్ని జోనర్స్ లో సినిమాలు చేయమని చెప్పారని’ అన్నాడు. అలాగే నేను ఎస్.ఎస్ రాజమౌళి గారి సలహాలు కచ్చితంగా పాటిస్తానని అన్నాడు. ‘ ఎస్.ఎస్ రాజమౌళి గారు వేరే హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు నీ దగ్గరికి వస్తే చెయ్యొద్దు ఎందుకంటే ఆ కథలు వేరే వారి కోసం రాసినవి, అవి నీకు సెట్ అవ్వవు అని సలహా ఇచ్చారు. నా సినిమాల మధ్య లాంగ్ గ్యాప్ ఉండటానికి అది కూడా ఓ కారణమని’ సుశాంత్ తెలిపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Exit mobile version