ప్రేమ కోసం పోరాడుతున్న సుశాంత్

ప్రేమ కోసం పోరాడుతున్న సుశాంత్

Published on Nov 3, 2012 4:05 AM IST

సుశాంత్ రానున్న చిత్రం “అడ్డా” చిత్రీకరణ చివరిదశల్లో ఉంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోస్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంటుంది.గత కొద్ది రోజులుగా 16 మందితో భారీ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు “కణాల్ కన్నన్ మాస్టర్ మరియు దేవ్ గిల్ తో ఫైట్ కంపోజ్ చేస్తున్నారు చాలా స్టైలిష్ గా ఫైట్ వస్తుంది” అని సుశాంత్ ట్విట్టర్లో చెప్పారు. శాన్వి ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది. పూరి జగన్నాథ్ సహాయకుడిగా చేసిన సాయి రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవ్వనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుశాంత్ చివరగా తెలుగులో “కరెంట్” అనే చిత్రంలో కనిపించారు ఈ చిత్రం మంచి విజయం సాదిస్తుందని ఆశలు పెట్టుకొని ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు