మారిన సూర్య సినిమా టైటిల్


తమిళ హీరో సూర్య అవిభక్త కవలలుగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘మాట్రాన్’. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో అనువదించి, విడుదల చేస్తున్నారు. బెల్లంకొండ మొదట ఈ సినిమాకి ‘డూప్లికేటు’ అనే టైటిల్ ని అనుకున్నారు, అది కథకి అంత బాగా సెట్ కాలేదనే ఉద్దేశంతో ఈ చిత్రానికి ‘బ్రదర్స్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్ర తెలుగు వర్షన్ కి స్వయంగా సూర్య గారే డబ్బింగ్ చెప్పనుండడం విశేషం. ‘వీడొక్కడే’ మరియు ‘రంగం’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన కె.వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అందాల భామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ తో పాటు ఇద్దరు రష్యన్ భామలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఎక్కువ భాగం చెన్నై, హైదరాబాద్ మరియు ఈస్ట్ యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే సమయానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం కూడా విడుదల కానుంది. ఒకే టైములో విడుదల చేయాలనుకుంటున్న ఈ రెండు పెద్ద చిత్రాలకు థియేటర్లు కుదిరి ఒకేసారి విడుదలవుతాయా లేదా అనే దానికోసం కొంత కాలం వేచి చూడాల్సిందే.

Exit mobile version