సూర్య రాబోతున్న చిత్రం “బ్రదర్స్” అక్టోబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో తమిళంలో “మాత్రాన్” చిత్రానికి అనువాదం. కే వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబర్ 22న భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ చిత్రంలో సూర్య అవిభక్త కవలల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో చాలా భాగం వరకు యూరోప్,హైదరాబాద్ మరియు చెన్నై లలో చిత్రీకరించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో విడుదలవుతున్న అతి పెద్ద సూర్య చిత్రం “బ్రదర్స్” ఈ చిత్ర పంపిణి హక్కులను బెల్లంకొండ సురేష్ 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారని సమాచారం.