తమిళ్ స్టార్ సూర్య మరియు హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘మాత్రాన్’. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘డూప్లికేట్’ పేరుతో డబ్ చేయబోతున్నారు. రంగం చిత్రంతో భారీ హిట్ కొట్టిన కె.వి ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్ర తెలుగు పంపిణీ హక్కులు దక్కించుకోగా హారిస్ జై రాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డూప్లికేట్ చిత్రాన్ని వేసవిలో భాటీ చిత్రాలతో పాటుగా విడుదల చేయనున్నారు.