సర్ప్రైజ్: ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘థగ్ లైఫ్’

సర్ప్రైజ్: ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘థగ్ లైఫ్’

Published on Jul 3, 2025 8:02 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ చిత్రమే “థగ్ లైఫ్”. నటుడు శింబు కూడా సాలిడ్ పాత్రలో నటించిన ఈ సినిమా అనుకున్న రెస్పాన్స్ ని అందుకోలేక డే 1 కే ప్లాప్ టాక్ తో డిజాస్టర్ అయ్యింది. దీనితో ఈ దెబ్బకి సినిమా ఓటిటిలో ముందే వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది.

మరి ఫైనల్ గా అనుకున్నట్టే ముందే నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రం వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ లేట్ గా వస్తుంది అనుకున్నారు కానీ ఇది కూడా వచ్చేసింది. దీనితో మొత్తం 5 భాషల్లోనీ ఈ చిత్రం వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు