‘సూర్య – వెంకీ’ సినిమా మొదలైంది !

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి చాలా కాలంగా చూస్తున్నాడు. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభించబడింది. ఈ పూజా కార్యక్రమంలో సినిమా టీం హాజరయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అలాగే, రాబోయే రోజుల్లో ఈ సినిమాలోని మిగిలిన ప్రధాన తారాగణం గురించి వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు.

అన్నట్టు ఇప్పటికే, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని టాక్ నడిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version