హైదరాబాద్ లో సూర్య “మాట్రన్” చిత్రీకరణ


సూర్య మరియు కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం “మాట్రన్” త్వరలో హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. “రంగం” లాంటి విజయవంతమయిన చిత్రం తరువాత కే వి ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతం లో కెవి ఆనంద్ మరియు సూర్య లు కలిసి “వీడోక్కడే” చిత్రాన్ని చేసారు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్ లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది. 70% పైగా ఈ చిత్రం పూర్తయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం తూర్పు ఐరోపా లో అందమయిన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకుంది. తెలుగు లో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “వీడే” అనే పీరుని పరిశీలిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version