సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?

సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?

Published on Sep 13, 2025 7:06 AM IST

తమిళంలో సినిమాల మధ్య పోటీ ఉంటే ఆ పస వేరుంటుందని అక్కడి ప్రేక్షకులు భావిస్తారు. ముఖ్యంగా టాప్ హీరోల మధ్య పోటీ ఉంటే వారి సినిమాల కోసం అభిమానుల సందడి మామూలుగా ఉండదు. అయితే, ప్రతి పండుగ సీజన్‌లో మాదిరే, ఈ సంక్రాంతి బరిలో కూడా పలువురు హీరోల తమ సినిమాలతో పోటీకి వస్తున్నారు. కానీ, ఈ పోటీ కారణంగా ఇప్పుడు హీరో సూర్యకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.

సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ ఎలాగైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చాలా కష్టపడుతున్నాడు. దీని కోసమే ఈ సినిమాను పొంగల్ బరిలో రిలీజ్ చేస్తే తన సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుందని ఆయన భావించాడు. కానీ, మరో స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇక తాజాగా మరో హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దీంతో సూర్య ‘కరుప్పు’ సంక్రాంతి రిలీజ్ ఆశలపై నీళ్లు జల్లినట్టు అయ్యింది. ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ కానుండటం.. అసలే ఫ్లాపులతో సతమతమవుతున్న తన సినిమాను వారి సినిమాలతో పోటీగా రిలీజ్ చేస్తే ఫలితం ఉండదని సూర్య అండ్ టీమ్ భావిస్తున్నారు. దీంతో వారు సమ్మర్ రిలీజ్‌కే మొగ్గు చూపుతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఈ విషయంపై సూర్య అండ్ టీమ్ ఏదైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.

తాజా వార్తలు