కొత్త సినిమా కోసం లుక్ మార్చుకున్న సూర్య

కొత్త సినిమా కోసం లుక్ మార్చుకున్న సూర్య

Published on Dec 29, 2013 8:30 PM IST

Surya
తమిళ హీరో సూర్య – సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అలాగే ఇప్పటికే సూర్య – సమంతలపై కొన్ని సీన్స్ ని షూట్ చేయగా మరి కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. అన్నికంటే ముఖ్యంగా సూర్య ఈ సినిమా కోసం తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు.

సింగం 2 సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మీసంతో కనిపించిన సూర్య ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసం సూర్య కాస్త బరువు తగ్గడమే కాకుండా హెయిర్ స్టైల్ మరియు గడ్డం కూడా పెంచాడు. సూర్య అభిమానులు ఇప్పటికే సూర్య కొత్త సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడని ప్రచారం చేస్తున్నారు.

సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని రెడ్ డ్రాగన్ కెమెరాతో షూట్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా 2014 సమ్మర్లో రిలీజ్ అవుతుంది.

తాజా వార్తలు