మహేష్ కు స్పెషల్ థాంక్స్ తెలిపిన సూర్య.!

ఇప్పుడు మన దక్షిణాదిలో ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో కూడా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం “ఆకాశం నీ హద్దురా” కోసమే హాట్ టాపిక్. ఒక్క ప్రేక్షకులు, విమర్శకులు నుంచే కాకుండా ఎందరో స్టార్ నటులు కూడా ఈ సినిమా చూసాక తమ ఫీలింగ్ ను షేర్ చేసుకోకుండా ఉండలేకపోయారు.

అలా లేటెస్ట్ గా మన టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ఎలా అనిపించిందో తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని సూర్య నటనను కూడా స్పెషల్ గా మెన్షన్ చేశారు. దీనితో సూర్య కూడా తన స్పందను తెలియజేసి స్పెషల్ థాంక్స్ కూడా తెలిపారు.

ఓ టన్ లో థాంక్స్ తెలుపుతున్నాని అలాగే ఇప్పుడు తాను చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని సూర్య మహేష్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. దీనితో ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చినట్టు అయ్యింది. అలాగే సూర్య కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version