వెనువెంటనే చిత్రాలను చేస్తూ ఈ మధ్య కాలంలో సమంత చాలా బిజీగా ఉంటుంది ఈ భామ ఎటువంటి ఆసక్తికరమయిన చిత్రాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. “ఎవడు” చిత్రం నుండి తప్పుకున్నాక ఈ భామ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల చిత్రం మరియు ఎన్టీఆర్ – హరీష్ శంకర్ లను చిత్రాలను ఒప్పుకుంది. తమిళంలో గౌతం మీనన్ “నీదనే ఎన్ పోన్వసంతం” చిత్రం విడుదల కోసం వేచి చూస్తుంది ఇది కాకుండా లింగుస్వామి దర్శకత్వంలో ఒక చిత్రానికి సంతకం చేసింది. ఈ చిత్రంలో సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రం 2013 మార్చ్ లో మొదలుకానుంది “సింగం 2” చిత్ర చిత్రీకరణ ముగిసాక సూర్య ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ నటి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. “ఆటోనగర్ సూర్య” మరియు “జబర్దస్త్” చిత్రాలు చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. రాబోయే కొద్ది నెలల పాటు ఆమె అభిమానులకు కన్నుల పండుగ కానుంది