సూర్య సినిమాకు భారీ స్థాయి రెస్పాన్స్ అట.!

సూర్య సినిమాకు భారీ స్థాయి రెస్పాన్స్ అట.!

Published on Nov 13, 2020 1:01 PM IST

ఈ మధ్య కాలంలో వచ్చిన ఓటిటి రిలీజ్ సినిమాల్లో ట్రూ యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మాత్రం సూర్య నటించిన “ఆకాశం నీ హద్దురా” అని చెప్పాలి. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ్ లో “సురారై పొట్రు”గా తెరకెక్కించి తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్ లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ అయ్యింది. అలా అయ్యి ఒకటే టాక్ ను తెచ్చుకొని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే రెండు భాషల్లో కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొన్న ఈ చిత్రం ఓటిటిలో మన దక్షిణాది నుంచి ఏ చిత్రానికి రాని స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో మొట్టమొదటి రోజునే 55 మిలియన్ కు పైగా భారీ స్థాయి వ్యూవర్ షిప్స్ ను అందుకున్న ఈ చిత్రం ఈ నాలుగు రోజుల్లో ఏకంగా 100 మిలియన్ వ్యూవర్ షిప్స్ ను కొల్లగొట్టడం ఖాయం అని ఓటిటి నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై మిస్సయ్యిపోయాం అని చాలా మంది బాధ పడుతున్నారు. మరి బహుశా ఇదంతా దాని ఎఫెక్ట్ అనే చెప్పాలి.

తాజా వార్తలు