కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రమే ‘రెట్రో’. అయితే ఈ చిత్రం సూర్య కెరీర్లో మంచి అంచనాలు నడుమ వచ్చింది. కంగువా లాంటి డిజప్పాయింట్మెంట్ తర్వాత కూడా ఈ చిత్రం తెలుగులో కూడా మంచి బజ్ నడుమే వచ్చింది.
కానీ తెలుగులో మాత్రం డిజప్పాయింట్ రెస్పాన్స్ ని అందుకుంది. తమిళ్ లో మాత్రం బాగానే రాణించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో నేడు మే 29 నుంచే అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ చిత్రం కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సూర్య దంపతులు నిర్మాణం వహించారు.