నార్వేలో చిందేస్తున్న సూర్య – కాజల్

నార్వేలో చిందేస్తున్న సూర్య – కాజల్

Published on Aug 18, 2012 11:53 AM IST


సూర్య మరియు కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘ మాట్రాన్’ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి కె.వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాటని బ్రెజిల్ లో చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చాయి, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ పాటను నార్వేలో చిత్రీకరిస్తున్నారు. కె.వి ఆనంద్ గతంలో తీసిన ‘రంగం’ సినిమాలో కూడా నార్వేలో ఒక పాటను చిత్రీకరించారు, మళ్ళీ రెండవసారి నార్వేలోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం కోసం ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో సూర్య అవిభక్త కవలుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ తో పాటు ఇద్దరు రష్యన్ భామలు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం చిత్రీకరణ ఈస్ట్ యూరోప్, హైదరాబాద్ మరియు చెన్నైలలో జరుపుకుంది. హారీష్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో ‘డూప్లికేట్’ అనే పేరుతో బెల్లంకొండ సురేష్ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు