సింగం సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న సూర్య

సింగం సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్న సూర్య

Published on Jun 5, 2013 3:30 AM IST

Singam2
‘సింగం’ సినిమాపై సూర్య భారీ అంచనాలే పెట్టుకున్నాడు. 2010లో విడుదలైన ‘సింగం’ సినిమాకు కొనసాగింపుగా ‘సింగం2’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. తెలుగులో ‘యముడు’గా అనువాదం అయిన ఈ సినిమా ఇక్కడ కూడా విజయం సాదించింది. మొదటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన హరి మరోసారి సూర్యతో కలిసిపనిచెయ్యనున్నాడు. ఈ సినిమాలో అనుష్క, హన్సిక హీరోయిన్స్. “నాకు పోలీసు పాత్రలు కలిసొచ్చాయి. గౌతం మీనన్ ‘కాకా కాక’ గానీ, ‘సింగం’ గానీ ప్రేక్షకుల ప్రశంసలను నాకు అందించేలా చేసాయని” చెన్నైలో మీడియా సమావేశంలో సూర్య తెలిపాడు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ప్రచారం చెయ్యడానికిగాను రేపు హైదరాబాద్ రానున్నాడు. ఈ సినిమాను సౌత్ ఆఫ్రికా, తమిళనాడు ప్రాంతాలలో తెరకెక్కించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకులముందుకురానుంది.

తాజా వార్తలు