కమల్ హాసన్ కి మరో ఎదురుదెబ్బ !

కమల్ హాసన్ కి మరో ఎదురుదెబ్బ !

Published on Jun 9, 2025 9:00 PM IST

‘థగ్ లైఫ్’ సినిమాపై కర్ణాటకలో నిషేధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ కమల్ హాసన్ పిటిషన్ కూడా వేశారు. కోర్టు ద్వారా కేసును పరిష్కరించడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉండగానే కమల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా కమల్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, హైకోర్టు తీర్పు చెప్పే వరకు వేచి ఉండాలని ఆదేశాలు జారీ చేయడం విశేషం.

‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అని కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘థగ్ లైఫ్’ సినిమా కర్ణాటకలో విడుదల కాలేదు. పిటిషన్ పై విచారణకు సుప్రీంకోర్టు కూడా నో చెప్పడంతో కమల్ కు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. మరోవైపు కర్ణాటకలో థగ్ లైఫ్ కు వ్యతిరేకంగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రదర్శించడానికి అనుమతి లేదు అంటూ కన్నడ అభిమానులు పట్టుదలగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు