‘బాద్షా’ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

‘బాద్షా’ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్

Published on Aug 31, 2012 11:06 AM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లకు నందమూరి అబిమానుల నుండి మరియు సినీ అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్ మరియు హెయిర్ స్టైల్ అందర్నీ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు, ఈ పోస్టర్లని అందరికంటే ముందుగా 123తెలుగు.కామ్ అందించింది. ఈ పోస్టర్ల గురించి నలుమూలాల నుండి మాకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.

ఎన్.టి.ఆర్ కి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఆదిత్య ఈ చిత్ర పోస్టర్లని చూసి ‘ ‘బాద్షా’ మూవీలో తారక్ లుక్ చాలా సూపర్బ్ గా ఉంది మరియు ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ ఇంత సూపర్బ్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనదంగా ఉంది’. అలాగే ఎన్.టి.ఆర్ మరియు రాజమౌళికి వీరాభిమాని అయిన అనిల్ చౌదరి ఈ విషయం పై స్పందిస్తూ ‘ తారక్ లుక్ చాలా బాగుంది, ముఖ్యంగా హెయిర్ స్టైల్ తారక్ కి చాలా బాగా కుదిరింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ మూవీ పై ఆసక్తి ని పెంచేస్తున్నాయి. తారక్ ని ఇంత కొత్తగా చూపిస్తున్నందుకు శ్రీను వైట్ల కి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని అన్నారు.

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాషింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అదిరిపోయే బుజినెస్ ఆఫర్లు వస్తున్నందుకు బండ్ల గణేష్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. 2013 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఫస్ట్ లుక్ కోసం క్లిక్ చేయండి.

తాజా వార్తలు