ఈ ఏడాది లాక్ డౌన్ మూలాన మొత్తం మన ప్రపంచపు సినీ ఇండస్ట్రీలోనే అతి పెద్ద బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ మెల్లగా అలా కాలంతో పాటుగా అలవాటు చేసుకొని చిత్ర యూనిట్స్ కూడా షూటింగులు మొదలు పెట్టారు. అలా మన తెలుగు హీరోలు కూడా ఒక్కొక్కరిగా సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఒకరైన సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు షూట్ కోసం స్పాట్ లో ల్యాండ్ అయ్యారు.
చాలా కాలం విరామం తర్వాత మహేష్ మళ్ళీ కెమెరా ముందుకు ఈరోజు వచ్చిన దృశ్యం బయటకు వచ్చింది. అయితే మహేష్ ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం “సర్కారు వారి పాట” షూట్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. కానీ గ్యాప్ లో మహేష్ బాబు ఒక యాడ్ షూట్ కోసం బయటకు వచ్చారు. ఇపుడు ఆ షూటింగ్ స్పాట్ లోని మహేష్ ఉన్న పిక్ బయటకు వచ్చింది. దీనితో మొత్తానికి మళ్ళీ బాబు షూటింగ్ స్పాట్ లో ల్యాండ్ అయ్యిపోయాడని చెప్పాలి.