సడన్ స్టార్ సినిమా చూసిన సూపర్ స్టార్


క్యూబ్ లాంటి డిజిటల్ ప్రింట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన టాప్ హీరోలందరూ తమ ఇళ్ళల్లోనే సినిమాలు చూస్తున్నారు. అలా మన కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ సినిమాని సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రత్యేకంగా తన గృహంలో తిలకించారు. రజనీ గారికి సినిమా చాలా నచ్చిందని సమాచారం. ఇండియన్ సినిమాకి స్టైలిష్ హీరోయిజంని పరిచయం చేసిన హీరో రజనీ, అదే కాన్సెప్ట్ ని సినిమాలో పేరడీ చేసిన విధానం ఆయనకీ చాలా బాగా నచ్చిందన్న సమాచారం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

విడుదలై రెండువారాలు అవుతున్నా ఈ చిత్రం ఇంకా మంచి కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అల్లరి నరేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.

Exit mobile version